నుమాయిష్‌కు లైన్ క్లియర్.. జాగ్రత్తలతో నిర్వహించుకోండి: సొసైటీకి హైకోర్టు పర్మిషన్

By sivanagaprasad KodatiFirst Published Dec 31, 2019, 6:27 PM IST
Highlights

నాంపల్లిలోని ప్రతిష్టాత్మక నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. జనవరి 1 నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభానికి హైకోర్టు అనుమతించింది. అయితే కొన్ని ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం.

నాంపల్లిలోని ప్రతిష్టాత్మక నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. జనవరి 1 నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభానికి హైకోర్టు అనుమతించింది. అయితే కొన్ని ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం.

అన్ని శాఖలు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి రిపోర్టు సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో పాటు ఇతరత్రా కారణాల వల్ల నుమాయిష్ వల్ల అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Also Read:ESI Medical Scam:వేలకోట్లకు చేరువలో దేవికారాణి అవినీతి ఆస్తులు

ఈ క్రమంలో ప్రస్తుతం చేసిన ఏర్పాట్లపై పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టులో సోమ, మంగళవారాల్లో విచారణ జరిగింది. తీర్పు సందర్భంగా నుమాయిష్ గ్రౌండ్‌ మూడు లక్షల గ్యాలన్ల నీటిని తాము కుళాయిలు, సంపుల ద్వారా అందుబాటులో ఉంచుకుంటామని నిర్వహకులు కోర్టుకు తెలిపారు.

కాగా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 80వ నుమాయిష్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌లు పాల్గొంటారు.

Also Read:తెలంగాణ కొత్త సీఎస్‌గా సోమేష్‌కుమార్‌

గత ఏడాడి దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని రూ.3 కోట్లతో ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేస్తున్నామని ఈటల తెలిపారు. ఎగ్జిబిషన్ కొన్ని వేల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తుందని, ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని 18 విద్యాసంస్థల్లో 30 వేల మంది విద్యార్ధులకు విద్యను అందిస్తున్నామన్నారు. దుకాణాల సంఖ్య తగ్గించి జనాలు తిరిగేందుకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 
 

click me!