విచారించొద్దు: కృష్ణా జలాల వివాదంపై ఏపీ రైతుల పిటిషన్‌పై తెలంగాణ ఏజీ

By narsimha lodeFirst Published Jul 5, 2021, 3:23 PM IST
Highlights

: కృష్ణా జలాల వివాదంపై ఏపీకి చెందిన రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై ఏపీకి చెందిన రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.జస్టిస్ రామ్ చందర్ రావ్ బెంచ్  ముందు వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ పై వాదనలను చీఫ్ జస్టిస్ బెంచ్ బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ జస్టిస్ రామ్ చందర్ రావ్ బెంచ్ ముందు ప్రతిపాదించారు.

also read:జల వివాదంపై హైకోర్టుకి ఏపీ రైతులు: తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

ఈ ఏడాది జూన్ 28వ తేదీన తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 34 జీవోను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో కృష్ణా జిల్లా రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో ద్వారా అక్రమంగా విద్యుత్ ఉత్పత్తిని చేస్తోందని పిటిషన్ దారులు ఆరోపించారు.

అంతరాష్ట్ర జలవివాదంపై విచారించే అధికారం తమ పరిధిలో లేదని  తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇలాంటి విషయాలపై ట్రిబ్యునల్ కే పూర్తి అధికారులున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. సెక్షన్ 11 అంతరాష్ట్రాల జలవివాదం ప్రకారంగా పిటిషన్ అర్హతను హైకోర్టు ప్రశ్నించింది.సుప్రీంకోర్టు 2008లో జల వివాదాలపై తీర్పును చదువుకొని రావాలంది హైకోర్టు. ఈ విషయమై విచారణను రేపటికి వాయిదా వేసింది. 


 

 

 ఈ పిటిషన్ పై విచారణను  రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.


 

click me!