దర్బాంగా బ్లాస్ట్: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ లో ఎన్ఐఏ విచారణ, కీలక ఫైల్స్ స్వాధీనం

By narsimha lodeFirst Published Jul 5, 2021, 2:37 PM IST
Highlights

దర్బాంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ అధికారులు హైద్రాబాద్ లో కీలక ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్: దర్బాంగా బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ అధికారులు హైద్రాబాద్ లో కీలక ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో అరెస్టు చేసిన నాసిర్, ఇమ్రాన్ సోదరులను ఎన్ఐఏ బీహార్ నుండి హైద్రాబాద్ కు  తరలించింది.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  లో పార్శిల్ కార్యాలయంలో  ఎన్ఐఏ  అధికారులు విచారణ చేపట్టారు. పార్శిల్ కార్యాలయంలో   కీలకమైన డాక్యుమెంట్లను  స్వాధీనం చేసుకొన్నారు. ఈ పార్శిల్ కార్యాలయం నుండే  నాసిర్, ఇమ్రాన్ సోదరులు పేలుడు పదార్ధాలున్న పార్శిల్ ను పంపారు. ఈ పార్శిల్ లోని పేలుడు పదార్ధాలు దర్బాంగా రైల్వేస్టేషన్ లో పేలాయి. ఈ కేసు విచారణను ఎన్ఐఏకి అప్పగించారు.

also read:దర్బాంగా పేలుడు: ఫేక్ పాన్ కార్డు, మొబైల్‌ సమాచారంతో పార్శిల్ బుకింగ్

రైలును పేల్చేందుకు ఈ పేలుడు పదార్ధాలను ఉపయోగించారని ఎన్ఐఏ గుర్తించింది. హైద్రాబాద్ కు చెందిన ఇద్దరు సోదరులతో పాటు యూపీకి చెందిన మరో ఇద్దరు కూడ ఈ పేలుడులో భాగస్వామ్యం ఉందని  ఎన్ఐఏ గుర్తించింది. ఈ నలుగురికి కూడ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ గుర్తించింది.ఇమ్రాన్, నాసిర్ సోదరులతో ఎన్ఐఏ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది.


 

click me!