తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో నిత్యం ప్రజలతో ఉండే ప్రజా ప్రతినిధులకు సైతం కోవిడ్ 19 సోకుతుండటంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ క్రమంలో నిత్యం ప్రజలతో ఉండే ప్రజా ప్రతినిధులకు సైతం కోవిడ్ 19 సోకుతుండటంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
Also Read:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా
undefined
తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓఎస్డీ గంగాధర్‌కు కరోనా సోకడంతో ఆ శాఖలో కలకలం రేపుతోంది. నిన్న, మొన్న మంత్రి ఈటలతోనే ఓఎస్డీ వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆదివారం కూడా సీఎం కేసీఆర్ సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు.
ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్‌కి కరోనా సోకింది. అలాగే తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు పీఏకు పాజిటివ్‌గా తేలడంతో మంత్రి కుటుంబం హోం క్వారంటైన్‌లో ఉంటోంది.
Also Read:తెలంగాణలో ఎమ్మెల్యేలకు కూడా పాకిన కరోనా, జనగామ ఎమ్మెల్యేకి పాజిటివ్
మరోవైపు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన భార్య, డ్రైవర్, గన్‌మెన్, వంట మనిషికి సైతం కరోనా సోకడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి