కేసులు పెరుగుతున్నాయి..కానీ కరోనాపై భయం అక్కర్లేదు: మంత్రి ఈటల రాజేందర్

Siva Kodati |  
Published : Apr 20, 2021, 03:39 PM IST
కేసులు పెరుగుతున్నాయి..కానీ కరోనాపై భయం అక్కర్లేదు: మంత్రి ఈటల రాజేందర్

సారాంశం

రాష్ట్రంలో కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

రాష్ట్రంలో కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

మంగళవారం ఆయన సూర్యాపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్‌లో సరిహద్దు రాష్టాలతో పాటు తెలంగాణలో కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. నూటికి 95 శాతం పేషేంట్స్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం లేకుండా చికిత్స పొందుతున్నారన్నారు.

కేవలం 5 శాతం మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నామన్నారు. ఏడాది కాలంగా 99.5 శాతం నయమై ఇంటికి వచ్చారన్నారు. రాష్ట్రంలో వందల సెంటర్లలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని, ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఈటల తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో జల్లులు