వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

By Siva KodatiFirst Published Jan 15, 2021, 3:38 PM IST
Highlights

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వెల్లడించారు

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 139 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని వెల్లడించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారని శ్రీనివాస్ పేర్కొన్నారు. గాంధీ, నార్సింగ్ వ్యాక్సిన్ కేంద్రాల్లోని సిబ్బందితో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు.

రేపు ఒక్కో సెంటర్‌లో 30 మందికి వ్యాక్సిన్ ఇస్తామని శ్రీనివాస్ చెప్పారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి కోవిన్ సాఫ్ట్‌వేర్‌ను ఫాలో అవుతామన్నారు. రియాక్షన్ లాంటిది వస్తే ట్రీట్‌మెంట్‌కు సిద్ధంగా వున్నామని.. ఇప్పటికే 33 జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా చేశామని శ్రీనివాస్ ప్రకటించారు. 

కాగా, గర్భిణీలు, బాలింతలు, హిమోఫిలియా వ్యాధిగ్రస్తులు, 18 ఏళ్ల లోపు వారు ఎవరైనా వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి అన్నారు.

కరోనా నుంచి కోలుకొని 4 వారాలు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించారు. ఏ వ్యాక్సిన్‌లోనైనా రియాక్షన్ వచ్చే అవకాశాలుంటాయని, లక్షల్లో ఒకరికి తీవ్రమైన సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని డీఎంఈ అన్నారు.

రియాక్షన్‌ వచ్చిన వారికి చికిత్స కోసం 57 ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు డీఎంఈ రమేష్ రెడ్డి వెల్లడించారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లను గాంధీ హాస్పిటల్‌లో డీఎంఈ రమేష్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు.

click me!