కాంగ్రెస్ వార్ రూమ్ కేసు.. పోలీసుల అత్యుత్సాహంపై హైకోర్టు సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశం 

By Rajesh Karampoori  |  First Published Oct 17, 2023, 2:00 AM IST

Congress War Room: కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ వాలంటీర్లు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కే కవిత ముఖాలను మార్ఫింగ్‌ చేయడంపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కే లక్ష్మణ్‌, కే సుజనాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. 


Congress War Room: కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో నడిచే  వార్‌రూమ్‌ వాలంటీర్లు సీఎం కేసీఆర్, బీఆర్ ఎస్ నేతల ఫోటోలను  మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గతేదాడి ఆ వార్ రూమ్ పై పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులు పోలీసులు నిబంధనలను ఉల్లంఘించారనీ, వాలంటీర్లను అక్రమంగా నిర్బంధించారని తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. 

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కే లక్ష్మణ్‌, కే సుజనాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది . చట్టానికి వ్యతిరేకంగా వలంటీర్లను అరెస్టు చేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు నగర పోలీసు
కమిషనర్‌ను ఆదేశించింది. 

Latest Videos

undefined

డిసెంబర్ 2022లో ‘తెలంగాణ గళం’ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు, ఎమ్మెల్సీ కె కవిత, ఇతర BRS నాయకుల ముఖాలను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ వార్ రూమ్‌లోని కొంతమంది వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేశారు.

వాలంటీర్లను విడుదల చేయాలని కోరుతూ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు మల్లు రవి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తమ వాలంటీర్లు ఉన్నత విద్యావంతులని, రాబోయే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారని పిటిషనర్ వాదించారు.

మరోవైపు.. మాదాపూర్‌లోని మైండ్‌షేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి 'తెలంగాణ గళం' ఫేస్‌బుక్‌ పేజీని నిర్వహిస్తున్నట్లు విచారణలో గమనించామని, తగిన అనుమతులు పొందిన తర్వాత పోలీసులు డిటెనస్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అదే సమయంలో 50 కంప్యూటర్లు, పలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారని పోలీసులు వాదించారు. 

అయితే, పోలీసులు తమ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడ్డారని, కీలకమైన సర్వే డేటాను  ఎత్తుకెళ్లారని పిటిషనర్ వాదించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సెర్చి వారెంట్ లేకుండానే పోలీసులు రాత్రి సమయంలో సోదాలు నిర్వహించారనీ, తన సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని మల్లు రవి తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనీ, వార్ రూమ్ లో పనిచేస్తున్న సిబ్బందిని తెల్లవారుజామున 2 గంటలకు డిటెన్యూని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే బదులు పోలీసులు స్వయంగా 41ఎ నోటీసును అందజేయాలని బెంచ్ గమనించింది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా పోలీసు కమిషనర్‌ను ఆదేశించి కేసును ముగించింది.
 

click me!