Telangana: నిరుద్యోగుల‌కు సీఎం రేవంత్ తీపి కబురు..

By Rajesh KarampooriFirst Published Feb 10, 2024, 4:48 AM IST
Highlights

Group 1: తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటికే మరో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఆయన‌ గ్రూపు-1 నోటిఫికేషన్ పైనా స్పష్టత ఇచ్చారు. అతి త్వరలో పెంచిన పోస్టులతో గ్రూపు-1 నోటిఫికేషన్ ఇస్తామని శుక్రవారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.

Group 1: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరుద్యోగులకు శుభవార్తలు వినిపించారు.  త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్‌(Group 1 Notification)ను ఇస్తామని శుక్రవారం అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. అయితే, గ్రూప్‌- 1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. మరో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.

టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఆలస్యం అయ్యిందని సీఎం రేవంత్ తెలిపారు. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులను చేర్చినట్టు తెలిపారు.దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జూన్‌ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా.. ఈ పరీక్షకు దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు.  కాగా.. పేపర్‌ లీకేజీ, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రెండు సార్లు ఈ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే.

Latest Videos

ఏడాదిలోపు రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్‌పీఎస్సీని పునరుద్ధరించింది. తాజాగా మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. మహేందర్ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది.
 

click me!