రేపటి కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ సమావేశానికి హాజరుకానున్న తెలంగాణ: అధికారులకు కేసీఆర్ ఆదేశం

By Siva KodatiFirst Published Aug 31, 2021, 3:40 PM IST
Highlights

బుధవారం సాయంత్రం జలసౌధలో జరిగే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) భేటీకి హాజురుకావాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు రేపటి సమావేశానికి హాజరవుతారు. అలాగే సాయంత్రం జరిగే కేఆర్ఎంబీ- జీఆర్ఎంబీ సంయుక్త భేటీకి కూడా తెలంగాణ అధికారులు హాజరవుతారు

బుధవారం సాయంత్రం జలసౌధలో జరిగే కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) భేటీకి హాజురుకావాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు రేపటి సమావేశానికి హాజరవుతారు. అలాగే సాయంత్రం జరిగే కేఆర్ఎంబీ- జీఆర్ఎంబీ సంయుక్త భేటీకి కూడా తెలంగాణ అధికారులు హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్‌లోని క్లాజుల అమలుపై జీఆర్ఎంబీ సమావేశంలో చర్చించబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, బోర్డుల పరిధి అంశాలే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. కృష్ణా గోదావరి బేసిన్‌లోని పలు ప్రాజెక్ట్‌లపై కేంద్రానికి ఇప్పటికే ఇరు రాష్ట్రాలు ఫిర్యాదు చేయడంతో పాటు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి కూడా పలుమార్లు లేఖలు రాశాయి. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

click me!