హెరిటేజ్‌లో కరోనా కలకలం.. తెలంగాణ సర్కార్ సీరియస్: 34 మంది క్వారంటైన్‌లోకి

By Siva Kodati  |  First Published Apr 29, 2020, 2:39 PM IST

హైదరాబాద్ ఉప్పల్ పారిశ్రామికవాడలోని హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కరోనా కలకలంపై అధికారులు స్పందించారు. బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు హెరిటేజ్ మిల్క్ సెంటర్‌ను పరిశీలించి, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న 34 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు.

Also Read:ఈ రోజు కొత్తగా ఆరు కేసులే, ర్యాపిడ్ టెస్టులు చేయం: ఈటెల రాజేందర్

Latest Videos

undefined

మరోవైపు ఉద్యోగులను బెదిరించడంపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... హెరిటేజ్ మిల్క్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కరోనా బారినపడే ప్రమాదం ఉందని ప్లాంట్‌కు సమీపంలో నివసిస్తున్న స్థానికులు డిమాండ్ చేశారు.

ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న యువకుడికి తండ్రి నుంచి కరోనా పాజిటివ్ వచ్చినా, ఆ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు. అతనితో పాటు విధులు నిర్వహించిన 33 మందిని రహస్యంగా ఓ చిన్న ఇంటిలో ఉంచారు.

Also Read:కంది ఐఐటీ వద్ద పోలీసులపై వలస కార్మికుల దాడి, ఉద్రిక్తత

దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో సోమవారం కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరుకుంది, కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. 

click me!