వరద నష్టంపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ నివేదిక.. మొత్తం ఎంతంటే..?

Siva Kodati |  
Published : Jul 20, 2022, 09:37 PM ISTUpdated : Jul 20, 2022, 09:45 PM IST
వరద నష్టంపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ నివేదిక.. మొత్తం ఎంతంటే..?

సారాంశం

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంభవించిన నష్టానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. రూ.1400 కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో కేసీఆర్ సర్కార్ పేర్కొంది. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సంభవించిన నష్టానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. రూ.1400 కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో కేసీఆర్ సర్కార్ పేర్కొంది. తక్షణమే రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

శాఖలవారీగా నష్టం :
రోడ్లు భవనాల శాఖ - రూ.498 కోట్లు
పంచాయితీ రాజ్ శాఖ - రూ.449 కోట్లు
నీటి పారుదల శాఖ -  రూ.33 కోట్లు
పురపాలక శాఖ - రూ.379 కోట్లు
విద్యుత్ శాఖ - రూ.7 కోట్లు

మరోవైపు.. తెలంగాణకు హై పవర్ కమిటీని పంపాలని మంగళవారం అధికారులను ఆదేశించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah) . రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది హై పవర్ కమిటీ. అంతకుముందు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay), రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌లు (tarun chugh) అమిత్ షాను కలిశారు. తెలంగాణలో వరద నష్టంపై వీరిద్దరూ కేంద్ర హోంమంత్రికి వివరించారు. బాధితులను ఆదుకోవాలని బండి సంజయ్ కోరారు. అనంతరం పై విధంగా అమిత్ షా ఆదేశాలిచ్చారు. 

ALso Read:దొంగలు తయారయ్యారు, ఒక్క చెట్టయినా వుందా.. అన్నీ అమ్ముకు దొబ్బారు : ఫారెస్ట్ అధికారులపై కేసీఆర్ ఆగ్రహం

ఇకపోతే.. భద్రాచలం పట్టణంలో వరద పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం వాసులు ముంపునకు గురికావడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. శాశ్వత కాలనీల నిర్మాణం కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నందుకు సీఎం అభినందించారు. వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటామన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ