Etela Rajender: ప్ర‌కృతిని శాశించే శ‌క్తి ఎవ‌రికీ లేదు.. విదేశీ కుట్ర వ్యాఖ్య‌ల‌పై ఈట‌ల ఫైర్ 

Published : Jul 20, 2022, 07:13 PM IST
Etela Rajender: ప్ర‌కృతిని శాశించే శ‌క్తి ఎవ‌రికీ లేదు.. విదేశీ కుట్ర వ్యాఖ్య‌ల‌పై ఈట‌ల ఫైర్ 

సారాంశం

Etela Rajender: ప్రకృతిని శాశించే శక్తి మానవులకు లేదని, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద భీభత్సం విదేశీ కుట్ర అని సీఎం కేసీఆర్ అన‌డం హాస్యాస్పదమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 

Etela Rajender: ప్రకృతిని శాశించే శక్తి మానవులకు లేదని బీజేపీ నేత‌, హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద భీభత్సం విదేశీ కుట్ర అని సీఎం కేసీఆర్ అన‌డం హాస్యాస్పదమన్నారు.

 ప్రకృతిని శాశించి ప్రజలకు మేలు చేసే శక్తి అమ్మవారికే ఉందని పేర్కొన్నారు. ప్రకృతి విలయతాండవంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అనేక వరదలవల్ల గ్రామాలు నీట మునిగి ప్రజలు తిండికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల నుండి ప్రజలను కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. మస్త్య పారిశ్రామిక సహాకార సంఘం పెద్దపల్లి అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య అధ్యక్షతన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో , వివిధ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈటెలను గజమాలతో ఘనంగా సన్మానించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu