కొత్త రెవిన్యూ చట్టం: వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం

By narsimha lodeFirst Published Sep 7, 2020, 2:22 PM IST
Highlights

కొత్త రెవిన్యూ చట్టం తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.. వీఆర్ఓల నుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

హైదరాబాద్: కొత్త రెవిన్యూ చట్టం తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.. వీఆర్ఓల నుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

రెవిన్యూ శాఖలో అవినీతి చోటు చేసుకొందని... ఈ అవినీతిని రూపుమాపేందుకు కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రెవిన్యూ  చట్టం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

గత అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. కానీ కొన్ని కారణాలతో ఆ సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టలేదు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.

వీఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసింది. కొత్త చట్టానికి అనుగుణంగానే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కొత్త రెవిన్యూ చట్టం రూపకల్పన చేస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు అసెంబ్లీలో ప్రకటించారు.వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడంతో వారి వద్ద ఉన్న రికార్డులను ఇవాళ సాయంత్రం వరకు రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకొంటున్నారు. 

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.


 

click me!