హైదరాబాదుకు కరోనా ఊరట: తెలంగాణలో లక్షా 42 వేలు దాటిన కేసులు

Published : Sep 07, 2020, 09:20 AM IST
హైదరాబాదుకు కరోనా ఊరట: తెలంగాణలో లక్షా 42 వేలు దాటిన కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ కాస్తా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే హైదరాబాదులోనూ గత 24 గంటల్లో తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం 245 కేసులు మాత్రమే రికార్డయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో 1802 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్షా 42 వేల 771కి చేరుకుంది. క

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 895కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కు చికిత్స పొంది 2711 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినవారి సంఖ్య లక్షా 10 వేల 241కి చేరుకుంది. ఇంకా 31635 యాక్టివ్ కేసులున్నాయి. 

హైదరాబాదులో గత 24 గంటల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోదంి. గత 24 గంటల్లో హైదరాబాదులో కేవలం 245 పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 158, కరీంనగర్ జిల్లాలో 136, సిద్ధిపేట జిల్లాలో 106, సంగారెడ్డి జిల్లాలో 103 కేసులు నోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!
B.Shivadhar Reddy Given Grand Farewell తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఘనంగా పదవి విరమణ| Asianet Telugu