తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఇక నుంచి సాయంత్రం 'హెల్తీ డ్రింక్'..!

By Rajesh Karampoori  |  First Published Oct 23, 2023, 5:41 AM IST

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సర్కార్ సాయంత్రం మెనూలో 'రాగి జావ'ని అందించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహార సప్లిమెంట్‌గా రాగి జావను ప్రారంభించింది.
 


తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సర్కార్ దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించటమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటోన్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. 

ఇటీవల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు . అల్పాహార పథకం ప్రారంభించబడినందున విద్యార్థులు రోజు పాఠశాల నుండి బయలుదేరే ముందు రాగి జావను అందించాలని నిర్ణయించడం జరిగిందని ఒక అధికారి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాహార సప్లిమెంట్‌గా రాగి జావను పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే.. బెల్లం పొడితో కలిపిన ఈ సప్లిమెంట్ జావాను వారానికి మూడుసార్లు ఉదయం వేళలో అందించేవారు.

Latest Videos

అయితే.. ఇటీవల రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించగా.. అక్టోబరు 26న తిరిగి తెరిచిన తర్వాత అన్ని పాఠశాలలకు విస్తరింపజేయనున్నారు. రోజు వారీగా అల్పాహారం మెనూలో ఇడ్లీ, ఉప్మా, పూరీ, మిల్లెట్ ఇడ్లీ ఉంటాయి. పోహా, పొంగల్, వెజిటబుల్ పులావ్,కిచ్డీ లను అందించనున్నారు.ఈ పథకం 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు వర్తిస్తుంది.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సన్న బియ్యంతో ఇప్పటికే అందిస్తున్నారు. పప్పు, సాంబార్, వెజిటబుల్ కర్రీ, లెగ్యూమ్ వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ బిర్యానీ, బగారా రైస్ , పులిహోర వంటి ప్రత్యేక అన్నం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా వడ్డిస్తారు. విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు కూడా అందజేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో పంచుకుంటే, 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గుడ్లతో పాటు 9, 10వ తరగతి విద్యార్థులకు భోజన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తుంది.

click me!