MLC Kavitha: వార్‌ వన్‌సైడే.. ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు..: ఎమ్మెల్సీ కవిత

By Rajesh Karampoori  |  First Published Oct 22, 2023, 10:58 PM IST

MLC Kavitha: తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మూడోసారి సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని.. హ్యాట్రిక్‌ కొడుతారన్నారు.  


MLC Kavitha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచారం మొదలు పెట్టగా.. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థల ఎంపికపై కుస్తీ పడుతున్నాయి. ఈ తరుణం సమయం దొరికినప్పుడల్లా అధికార ప్రతిపక్ష మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించింది. తెలంగాణలో వార్ వన్ సైడేనని, బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని కవిత స్పష్టం చేశారు. మూడోసారి సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ హ్యాట్రిక్‌ కొడుతారన్నారు.   

ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు సోలాపూర్ లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని మహారాష్ట్రలో కొనసాగించడం చాలా సంతోషంగా ఉందనీ, మహారాష్ట్ర సంస్కృతిని కూడా పాటిస్తూ.. అక్కడ తెలంగాణ వాసులు గంగా జమున తహజీబ్ లా కలిసిపోయారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతులు, మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. తమ ప్రభుత్వం చేసిన అభివ్రుద్ది పనులే తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

Latest Videos

ఈ తరుణంలో బీజేపీ గురించి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో 105 సీట్లలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలోని అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పై కూడా విమర్శలు గుప్పించారు. ప్రజలను ఎప్పుడూ మభ్యపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని అన్నారు. 65 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ చేయనన్ని పనులను గత 10 ఏళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని, సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు గమనిస్తున్నారనీ, బీఆర్ఎస్ వైపు నిలుస్తారన్న విశ్వాసం ఉందన్నారు.

click me!