వృద్ధాప్య పింఛన్ వయో పరిమితి 57 ఏళ్లకు తగ్గింపు.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు, వెంటనే అమల్లోకి

By Siva KodatiFirst Published Aug 4, 2021, 7:51 PM IST
Highlights

తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57 ఏళ్లకు తగ్గిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్య పెన్షన్ అర్హత 57 ఏళ్లకు తగ్గించడంతో మరో 6.62 లక్షల మందికి కొత్త పించన్లు అందనున్నాయి.

Also Read:తెలంగాణ: వృద్ధాప్య పింఛను అర్హత 57 ఏళ్లకు తగ్గింపు.. కేబినెట్ కీలక నిర్ణయాలు

కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ పద్ధతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్‌ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. దోభీ గాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌నివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

click me!