వాసాలమర్రితోనే దళిత బంధు ప్రారంభం.. హుజురాబాద్‌లో లాంఛనమే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 4, 2021, 6:53 PM IST
Highlights

వాసాలమర్రిలో దళిత బంధు లాంచ్ అయ్యిందని.. ఇక హుజురాబాద్‌లో లాంఛనమేనని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 6 నెలల తర్వాత వాసాలమర్రికి వచ్చి దళితవాడలో భోజనం చేస్తానని కేసీఆర్ తెలిపారు. భూమ్మీద ఏ మనిషీ వెయ్యేళ్లు బతకడానికి రాలేదని.. ఉన్న జన్మలోనే మంచిగా బతికి చూపిద్దాని సీఎం పిలుపునిచ్చారు. 

చదువుకున్న దళిత బస్తీ యువకులే కేసీఆర్ ఆస్తి అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దళిత బంధు వచ్చినా రైతు బంధు, ఆసరా, ఫ్రీ కరెంట్ ఆగదని కేసీఆర్ హామీ ఇచ్చారు. రూ.10 లక్షల మీద వచ్చే ఆదాయాన్ని కూడా కాపాడి జమ చేయాలని సీఎం అన్నారు. వాసాలమర్రిని నేను దత్తత తీసుకున్నానని కాబట్టి.. ఉన్న 76 కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపజేస్తున్నానని కేసీఆర్ తెలిపారు. రూ. 10 లక్షల్లో పది పైసలు కూడా వేస్ట్ కావొద్దని సీఎం సూచించారు. నైపుణ్యం వున్నా అవకాశం లేక దళితులు నీరుగారిపోతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:లాభం లేని వ్యాపారం పెట్టి ఆగం కావొద్దు.. రూ.10 లక్షలు వేస్ట్ చేశారో : దళిత బంధుపై కేసీఆర్ హెచ్చరికలు

తొందరపడి లాభం రాని వ్యాపారాలు పెట్టుకోవద్దని సీఎం పేర్కొన్నారు. 6 నెలల తర్వాత వాసాలమర్రికి వచ్చి దళితవాడలో భోజనం చేస్తానని కేసీఆర్ తెలిపారు. భూమ్మీద ఏ మనిషీ వెయ్యేళ్లు బతకడానికి రాలేదని.. ఉన్న జన్మలోనే మంచిగా బతికి చూపిద్దాని సీఎం పిలుపునిచ్చారు. దళితులు బాగా బతకాలని.. మీ పిల్లలకు బంగారు బాట వేయాలని కేసీఆర్ ఆకాంక్షించారు. పట్టుబట్టి, జట్టుకట్టి వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వాసాలమర్రిలో దళిత బంధు లాంచ్ అయ్యిందని.. ఇక హుజురాబాద్‌లో లాంఛనమేనని కేసీఆర్ పేర్కొన్నారు. 

click me!