లాభం లేని వ్యాపారం పెట్టి ఆగం కావొద్దు.. రూ.10 లక్షలు వేస్ట్ చేశారో : దళిత బంధుపై కేసీఆర్ హెచ్చరికలు

By Siva KodatiFirst Published Aug 4, 2021, 6:28 PM IST
Highlights

వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రేపట్నుంచే వారి ఖాతాల్లో రూ.10 లక్షల డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు. 

దళిత బంధు సొమ్ముపై పూర్తి బాధ్యత దళితులదేనని సీఎం తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో రూ.30 కోట్లతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం చెందిన దళిత రక్షణ నిధి నుంచే ఖర్చు చేస్తామని సీఎం తెలిపారు. వాసాలమర్రి ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నిధుల విడుదలకు సంబంధించి ఇవాళే జీవో జారీ చేయిస్తానని సీఎం వెల్లడించారు. గ్రామానికి, మండలానికి, జిల్లాకు దళితబంధు కమిటీ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతీ లబ్ధిదారుడికి కార్డు ఇస్తామని.. అందులో ఎలక్ట్రానిక్ చిప్ వుంటుందని సీఎం తెలిపారు.

Also Read:వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు దళిత బంధు.. రేపట్నుంచే రూ.10 లక్షల పంపిణీ: కేసీఆర్ ప్రకటన

దళిత బంధు పథకంలో ప్రతీ లబ్ధిదారుడికి ఇచ్చే రూ.10 లక్షల్లో రూ.10 వేలు కట్ చేసి రూ.10 వేలు ప్రభుత్వం నుంచి జమ చేసి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేసుకుంటాని కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధు కోసం రూ.లక్షా  20 వేల కోట్టు ఖర్చవుతాయని అయినా వెనకడుగు వేసేది లేదని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు పడినట్లే.. దళిత జాతి కూడా గడ్డకు పడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశంలో ధనిక దళితులు ఎక్కడున్నారంటే తెలంగాణలో వున్నారని చెప్పుకోవాలని సీఎం అన్నారు. రూ.10 లక్షలు దుర్వినియోగం చేస్తే తాను మళ్లీ మీ దగ్గరకు రానని కేసీఆర్ స్పష్టం చేశారు. రూ.10 లక్షలతో వ్యాపారం చేయాలని.. వచ్చిన లాభంతోనే బతకాలని సీఎం సూచించారు. దళిత బంధు పథకంపై ఇచ్చే డబ్బులు ఇళ్లు కట్టుకోవడానికి కాదని.. రూ. 10 లక్షలు ఇచ్చేది చికెన్ సెంటర్ లాంటి చిన్నాచితాకా వ్యాపారాల కోసం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. 

click me!