దీపావళి: సుప్రీం నిర్ణయానికే తెలంగాణ ఓటు.. బాణాసంచాపై ఆంక్షలు

Siva Kodati |  
Published : Nov 03, 2021, 06:29 PM ISTUpdated : Nov 03, 2021, 06:33 PM IST
దీపావళి: సుప్రీం నిర్ణయానికే తెలంగాణ ఓటు.. బాణాసంచాపై ఆంక్షలు

సారాంశం

దీపావళి (deepawali) టపాసులపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బేరియం సాల్ట్‌తో తయారు చేసిన క్రాకర్స్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అమ్మరాదని ఇటీవల సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించింది.

దీపావళి (deepavali) టపాసులపై తెలంగాణ ప్రభుత్వం (telangana govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బేరియం సాల్ట్‌తో తయారు చేసిన క్రాకర్స్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ అమ్మరాదని ఇటీవల సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు తప్పకుండా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన (telangana cs) కార్యదర్శి సోమేశ్ కుమార్ (somesh kumar) ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. 

కాగా.. బాణాసంచా నిషేధంపై ఇటీవల Supreme Court కీలక తీర్పునిచ్చింది. Calcutta High Court తీర్పును తోసిపుచ్చింది. West Bengal ఏమైనా ప్రత్యేకమా? అంటూ ప్రశ్నించింది. Fire Crackersపై సంపూర్ణ Ban సరికాదని వివరించింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కార్, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

ALso Read:బెంగాల్‌ ఏమైనా ప్రత్యేకమా?.. బాణాసంచాపై పూర్తి నిషేధం వద్దు.. సుప్రీంకోర్టు తీర్పు

ఫైర్ క్రాకర్స్‌ను నిషేధించాలని ఓ పర్యావరణ వేత్త దాఖలు చేసిన పిటిషన్‌పై కలకత్తా హైకోర్టు గతనెల 29న బాణాసంచా పూర్తిగా నిషేధిస్తూ తీర్పునిచ్చింది. గ్రీన్ క్రాకర్స్‌ను గుర్తించే మెకానిజం కూడా పోలీసుల దగ్గర లేదని, అందుకే మొత్తంగా క్రాకర్స్‌ను నిషేధిస్తూ ఆదేశాలనిచ్చింది. అంతకు ముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు క్రాకర్స్ కాల్చడానికి ప్రత్యేక సమయాన్ని, గడువునూ సూచించింది. కానీ, ఈ సూచనలను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది.

ఆకస్మికంగా వచ్చిన ఈ తీర్పుతో బాణాసంచా వ్యాపారులు హతాశయులయ్యారు. తెలంగాణలోని శివకాశి నుంచి తాము సరుకులు కొనుగోలు చేశామని, స్టాక్ కూడా తమ దగ్గరకు చేరుకుందని వ్యాపారులు ఖంగారుపడ్డారు. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది వరకే సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్‌పై సానుకూల తీర్పునిచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు రూలింగ్‌కు భిన్నంగా కలకత్తా హైకోర్టు ఆదేశాలనిచ్చిందని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా అన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తున్నాయని, అలాంటప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రత్యేకమా? అంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. దేశమంతటా తమ ఆదేశాలు అమల్లో ఉండాలని స్పష్టం చేసింది. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాటికి మినహాయింపులు ఉంటుందని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్