తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్ష జరగాల్సి వుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్ష జరగాల్సి వుంది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వుండటంతో ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా అక్టోబర్ 10 టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2, 3 బదులుగా జనవరి 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.