తెలంగాణలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి.. కండీషన్స్ అప్లయ్

Siva Kodati |  
Published : Dec 28, 2021, 06:17 PM ISTUpdated : Dec 28, 2021, 06:32 PM IST
తెలంగాణలో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు అనుమతి.. కండీషన్స్ అప్లయ్

సారాంశం

రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు కూడా అనుమతి మంజూరు చేసింది. మద్యం దుకాణాలు డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకే తెరిచేందుకు అనుమతిస్తామని.. బార్స్, ఈవెంట్స్, టూరిజం హోటల్స్‌ రాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తామని పేర్కొంది

రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు కూడా అనుమతి మంజూరు చేసింది. మద్యం దుకాణాలు డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకే తెరిచేందుకు అనుమతిస్తామని.. బార్స్, ఈవెంట్స్, టూరిజం హోటల్స్‌ రాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తామని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా.. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో డిసెంబర్ 25 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో వుంటాయని సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు విపత్తు నిర్వహణచట్టం కింద ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయనుంది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు.

Also Read:తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే

కొద్దిపాటి నియంత్రణ చర్యలతోనే జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.  అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేసి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా విధించనున్నారు. 

రెండురోజుల క్రితం న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది.కరోనాపై   Telangana High Court  గురువారం నాడు విచారణ నిర్వహించింది.ఈ విచారణ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. Maharashtra,delhi ప్రభుత్వాల మాదిరిగానే New year, christmas వేడుకలపై ఆంక్షలను పెట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.
 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu