కరోనా ఉద్ధృతి.. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : Jan 22, 2022, 07:23 PM ISTUpdated : Jan 22, 2022, 07:27 PM IST
కరోనా ఉద్ధృతి.. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సారాంశం

కరోనా (coronavirus) ఉద్ధృతి నేపథ్యంలో ఇంటర్, టెన్త్ పరీక్షలపై (10th and inter exams) కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ విద్యాశాఖ (telangana education department) . మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన పరీక్షలను మే లో నిర్వహిస్తామని తెలిపింది. సిలబస్ తగ్గింపుతో పాటు పరీక్షా పత్రంలో ఛాయిస్ పెంచాలని ఇప్పటికే విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. 

కరోనా (coronavirus) ఉద్ధృతి నేపథ్యంలో ఇంటర్, టెన్త్ పరీక్షలపై (10th and inter exams) కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ విద్యాశాఖ (telangana education department) . మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన పరీక్షలను మే లో నిర్వహిస్తామని తెలిపింది. సిలబస్ తగ్గింపుతో పాటు పరీక్షా పత్రంలో ఛాయిస్ పెంచాలని ఇప్పటికే విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. మామూలుగా అయితే ఇంటర్ , పదో తరగతి పరీక్షలు.. మార్చి, ఏప్రిల్‌లో జరుగుతాయి. మహమ్మారి ప్రభావంతో రెండు నెలలు ఆలస్యంగా పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది తెలంగాణ విద్యా శాఖ. మే మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు... ఆ తర్వాత పదో తరగతి పరీక్షలు జరిగే అవకాశం వుంది. అలాగే ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 8,9,10 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 50 శాతం మంది టీచర్లు విధులకు హాజరు కావాలని ఆదేశించింది. 

మరోవైపు దేశంలో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే వరుసగా మూడో రోజు కూడా దేశంలో 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,89,03,731కి చేరింది. మరోవైపు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల సంఖ్య పదివేలు దాటేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 488తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,88,884కి చేరింది. గత 24 గంటల్లో 2,42,676 కరోనాను జయించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,63,01,482కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక, దేశంలో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పెరిగింది. రోజువారి పాజివిటీ రేటు 17.22 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 16.65 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93.31 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 5.43 శాతం, మరణాల రేటు 1.26 శాతంగా ఉంది. 
అటు దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 10,050 Omicron కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది కిందటి రోజుతో పోలిస్తే 3.69 శాతం కంటే అధికం అని తెలిపింది. 

ఇక, శుక్రవారం (జనవరి 21) రోజున దేశంలో 19,60,954 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,34,99,892కి చేరినట్టుగా తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 67,49,746 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,61,16,60,078కి చేరింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్