ఎన్ని చట్టాలు చేసినా.. ఎంతమందికి కఠిన శిక్షలు విధించినా కామాంధుల తీరులో మార్పు రావడం లేదు. యువతులు, మహిళల నుంచి వృద్ధుల వరకు అందరినీ తమ కామదాహానికి బలి చేస్తున్న దుర్మార్గులు.. అభం శుభం తెలియని చిన్నారులతో కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ (telangana) రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి (jayashankar bhupalpally) జిల్లాలో దారుణం జరిగింది.
గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న ఆరేళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం (rape attempt) చేశాడు. అయితే చిన్నారి సోదరుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు గుర్రం కిషోర్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో శనివారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహిస్తుండగా.. కిషోర్ చేసిందంతా చెప్పారు. దీనిపై కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు కిషోర్ కు దేహశుద్ది చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలోనే నిందితుడికి మరోసారి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. కిశోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.