Dasara Holidays: మారిన దసరా సెలవులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Dasara Holidays: దసరా సెలవుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవును అక్టోబర్ 23కు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే..   

Google News Follow Us

Dasara Holidays: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవు తేదీలో మార్పులు చేసింది. దసరా సెలవును అక్టోబర్ 23వ తేదికి మార్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్తులు జారీ చేసింది. అంతేకాదు.. 24వ తేదీని కూడా సెలవుదినంగానే ప్రకటించింది. అలాగే..  25ని కూడా సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో శాస్త్రీయ పరంగా కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఏ రోజు పండుగ జరుపుకోవాలనే కన్ప్యూజన్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 23న దసరా నిర్వహించుకోవాలని సూచిస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఈ నెల 24న పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23నే విజయ దశమి (దసరా) పండుగ అని, ఈ రోజును సెలవును మార్చింది. ఇంతకు ముందు ప్రకటించిన సెలవును సైతం కొనసాగింది.

స్కూల్‌ విద్యార్థులకు సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న ఐచ్ఛిక సెలవు ఇచ్చింది.  ఇదిలా ఉండగా దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్‌ కాలేజీలకు ఏడు రోజులు సెలవులుగా ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు కాగా.. 26న కాలేజీలు పునఃప్రారంభం. అలాగే.. జూనియర్ కాలేజీలకు దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.

Read more Articles on