రూ.100 కోట్లతో ఓఆర్ఆర్‌పై సైక్లింగ్ ట్రాక్ .. కేటీఆర్‌తో ఓపెనింగ్ , కట్ చేస్తే బర్రెల ఫ్యాషన్ షో (వీడియో)

By Siva Kodati  |  First Published Oct 7, 2023, 9:02 PM IST

హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ఇటీవల అందుబాటులోకి వచ్చిన సైక్లింగ్ ట్రాక్‌పై గేదెలు తిరుగుతున్నాయి .  24 గంటలూ సీసీటీవీ కెమెరాలో మానిటరింగ్ చేస్తామని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అధికారులు . 


హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ఇటీవల అందుబాటులోకి వచ్చిన సైక్లింగ్ ట్రాక్‌పై గేదెలు తిరుగుతున్నాయి. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ దీనిని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించగా.. గత వారం మంత్రి కేటీఆర్ చేతల మీదుగా ప్రారంభించారు. కానీ నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. 24 గంటలూ సీసీటీవీ కెమెరాలో మానిటరింగ్ చేస్తామని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో సమీప గ్రామాలకు చెందిన వారు గేదెలను ఈ మార్గం మీదుగా తీసుకెళ్తున్నారు. బర్రెల ఫ్యాషన్ షోను ఎవరో సెల్‌ఫోన్‌లో వీడియో తీసి దానిని ఆన్‌లైన్‌లో పెట్టడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

హైదరాబాద్ ఓఆర్ఆర్‌ను అనుసరిస్తూ అత్యంత అధునాతన సౌకర్యాలతో 21 కి.మీ మేర సోలార్ సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి నార్సింగి , కొల్లూరు వరకు దీనిని నిర్మించారు. ఇందులో పార్కింగ్ స్థలాలు, నిఘా కెమెరాలు, సైకిల్ డాకింగ్, ఫుడ్ కోర్టులు, తాగునీరు, విశ్రాంతి గదులు, సైకిల్ రిపేర్ షాప్‌లు ఏర్పాటు చేశారు. 

Latest Videos

undefined

 

click me!