పాలిటెక్నిక్ ఎగ్జామ్ పేపర్ల లీకేజ్ : ఆ రెండు రోజుల్లో జరిగిన పరీక్షలు రద్దు, మళ్లీ ఎప్పుడంటే..?

Siva Kodati |  
Published : Feb 11, 2022, 05:54 PM IST
పాలిటెక్నిక్ ఎగ్జామ్ పేపర్ల లీకేజ్ : ఆ రెండు రోజుల్లో జరిగిన పరీక్షలు రద్దు, మళ్లీ ఎప్పుడంటే..?

సారాంశం

పాలిటెక్నిక్ పరీక్షా పేపర్ల లీకేజ్ (polytechnic exams) నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే  స్వాతీ కాలేజ్ అబ్జర్వర్‌పై సస్పెన్షన్  వేటు వేసింది. రద్దయిన పరీక్షలను ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.   

కాగా.. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేయడంతో ఇతర జిల్లాల్లోని కాలేజీ ప్రిన్సిపాళ్లు వెంటనే పాలిటెక్నిక్ బోర్డుకు సమాచారం ఇచ్చారు. దీంతో బోర్డు సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. కాలేజీ విద్యార్థులకు ప్రశ్నపత్రాల లింక్ ఏ విధంగా వెళుతుంది?.. ఏ కాలేజ్ నుంచి ఈ ప్రశ్న పత్రాల లీక్ వెళ్తుందో వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.

హైదరాబాద్ బాటసింగారంలో ఉన్న స్వాతి ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (swathi institute of technology and sciences) నుంచి ప్రశ్నాపత్రం లీకైనట్లు (exam paper leak0 పోలీసుల దర్యాప్తులో తేలింది. కాలేజీ సిబ్బంది కొందరు విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకుని ప్రశ్నాపత్నాలను వాట్సాప్ ద్వారా పంపినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు స్వాతి ఇంజినీరింగ్ కాలేజీపై కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్