బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు పీఆర్ వో రాజేష్, మరో ఇద్దరు సహాయకులకు కూడా నోటీసులు జారీ చేశారు. వారి ఫోన్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. వీరంతా సోమవారం ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు.
సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ రాజీవ్ కుమార్
undefined
ముడుపుల సొమ్ముతో కవిత భర్త భూములు కొన్నారని ఈడీ ఆరోపించింది. ఈ భూముల విలువ సుమారు రూ.5.5 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఈడీ అదుపులో ఉన్నారు. ఆమెను శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. దీంతో ఆమెకు కోర్టు 7 రోజుల పాటు కస్టడీ విధించింది. మార్చి 23వ తేదీన తిరిగి కోర్టులో హాజరుపర్చాలని కోర్టు ఈడీని ఆదేశించింది.
సీఏఏ అమలు నిలిపివేయాలి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
కాగా.. ఎమ్మెల్సీ కవితకు హైబీపీ ఉందని ఆమె లాయర్ కోర్టుకు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో బీపీ పెరగలేదని వెల్లడించారు. ఆమె అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కస్టడీ నుంచి ఉపశమనం ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ దానిని కూడా కోర్టు నిరాకరించింది. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ఆమెకు ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మెడిసిన్ అందించవచ్చని లాయర్ కు కోర్టు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 : షెడ్యూల్ , పోలింగ్ , ఫలితాలు .. ముఖ్యమైన తేదీలివే
అయితే కవిత కోరిన కొన్ని మినహాయింపులకు కూడా కోర్టు అంగీకారం తెలిపింది. ప్రతీ రోజూ ఫ్యామిలీ మెంబర్స్ ను, లాయర్స్ ను కలిసేందుకు అవకాశం ఇచ్చింది. అనంతరం ఆమెను ఈడీ తమ కార్యాలయానికి తీసుకెళ్లింది. కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు.