సోదరిగా భావిస్తే ఇలాగే వ్యవహరిస్తారా..?: గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Published : Apr 07, 2022, 01:46 PM IST
సోదరిగా భావిస్తే ఇలాగే వ్యవహరిస్తారా..?: గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆమె తెలంగాణలో ప్రోటోకాల్ వివాదం, ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆమె తెలంగాణలో ప్రోటోకాల్ వివాదం, ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలతో అమిత్ షాతో చర్చించానని చెప్పారు. అమిత్ షాతో చర్చించిన విషయాలు బయటకు చెప్పలేనని అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని చెప్పారు. తెలంగాణలో తాను రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని అన్నారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో అన్నారు. 

భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు హాజవుతానని చెప్పారు. మేడారంకు రోడ్డు మార్గంలోనే వెళ్లానని చెప్పారు. భద్రాచలంకు కూడా రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లనున్నట్టుగా తెలిపారు. భద్రాద్రి జిల్లాలోనూ గిరిజన ప్రాంతాలను సందర్శిస్తానని చెప్పారు. తెలంగాణలో ఎవరూ తన ప్రయాణాన్ని ఆపలేరని అన్నారు. మేడారంకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని తాను చెప్పలేదని.. సీతక్క చెప్పారని అన్నారు. యదాద్రిలో తనకు మర్యాద ఇవ్వలేదని మీడియా రాసిందని.. తాను అనలేదని తెలిపారు. 

తన విషయంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. తాను బాధ్యతయుతమైన పదవిలో ఉన్నానని చెప్పారు. తాను అందరితో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తినని తెలిపారు. రాజ్‌భన్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. సీఎం, మంత్రులు, సీఎస్.. రాజ్‌భన్‌కు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. తనతో సమస్య ఉంటో ఎవరైనా వచ్చి చర్చించవచ్చు అని చెప్పారు. 

యాదాద్రి ఆలయాన్ని తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నట్టుగా చెప్పారు. యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ తనను కలవలేదని చెప్పారు. యాదాద్రికి తాను బీజేపీ వ్యక్తిగా వెళ్లానని వాళ్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. రెండేళ్లలో తాను బీజేపీ నాయకులను కేవలం ఒకటి, రెండుసార్లే కలిశానని తెలిపారు. తమిళిసైని కాకపోయినా రాజ్‌భన్‌ను గౌరవించాలన్నారు. తాను ఎవరినీ విమర్శించట్లేదని చెప్పారు. తెలంగాణలో రాజ్‌భవన్, గవర్నర్ విషయంలో ఏం జరుగుతుందో మాత్రమే చెబుతున్నానని అన్నారు. 

రాజ్‌భవన్‌కు, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని అన్నారు. ఉగాది వేడుకలకు తాను ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించానని చెప్పారు. రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదన్నారు. రిపబ్లిక్ డే, ఉగాది కార్యక్రమాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఒక మహిళకు గౌరవం ఇవ్వాల్సిన విధానం ఇది కాదని అన్నారు. సోదరిగా భావిస్తే ఇలాగే వ్యవహరిస్తారా అని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?