తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై ఇంకా స్పష్టత రాలేదు. పాండిచ్ఛేరి నుండి హైద్రాబాద్ కు వచ్చిన గవర్నర్ ఈ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారంనాడు ఉదయం హైద్రాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిని ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. శనివారంనాడు గవర్నర్ రెండో దఫా అడిగిన సందేహాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ సమాధానం పంపారు.
తెలంగాణ ఆర్టీసీలోని ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఈ ఏడాది జూలై 31న తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం ప్రకారంగా బిల్లును రాష్ట్ర గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. అయితే ఈ బిల్లు ఈ నెల 2వ తేదీన తమకు చేరిందని రాజ్ భవన్ ప్రకటించింది.
ఈ బిల్లుపై నిర్ణయం తీసుకోవడానికి న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని రాజ్ భవన్ ప్రకటించింది. దీంతో రాజ్ భవన్ ను ఆర్టీసీ కార్మికులు శనివారం నాడు ముట్టడించారు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బిల్లుపై ఉన్న సందేహల విషయమై గవర్నర్ వారితో మాట్లాడారు. దీంతో కార్మిక సంఘాల నేతలు తమ ఆందోళనను విరమించారు. ఆర్టీసీ బిల్లు విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి శనివారంనాడు ఐదు ప్రశ్నలను పంపింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఉత్పన్నమయ్యే అంశాల గురించి ఆమె ప్రస్తావించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ సందేహలకు సమాధానాలను పంపింది.
శనివారం నాడు రాత్రి కూడ మరోసారి గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి సందేహలను పంపింది గవర్నర్. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల విషయమై స్పష్టత ఇవ్వాలని గవర్నర్ కోరారు.ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇవాళ సమాధానం పంపారు.
పుదుచ్చేరి నుండి తెలంగాణ గవర్నర్ ఇవాళ ఉదయం హైద్రాబాద్ కు చేరుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.
also read:టీఎస్ఆర్టీసీ బిల్లుపై మరోసారి వివరణ కోరిన తమిళిసై: అధికారులను పంపాలని ఆదేశం
ఇవాళ హైద్రాబాద్ కు చేరుకున్న తర్వాత ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏం చేయనుందో స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది.ఈ మేరకు ఇవాళ రాజ్ భవన్ కు వచ్చి ఈ విషయమై తన సందేహలను నివృత్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ కానున్నారు. గవర్నర్ అడిగే ప్రశ్నలకు ఆర్టీసీ అధికారులు సమాధానం చెప్పనున్నారు.ఈ భేటీ తర్వాత ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ స్పష్టత ఇచ్చే అవకాశం లేకపోలేదు.