నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తమిళిసై ఫోన్: ఇస్సపల్లి ఘటనపై ఆరా

Published : Jan 27, 2022, 12:44 PM ISTUpdated : Jan 27, 2022, 05:06 PM IST
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తమిళిసై ఫోన్: ఇస్సపల్లి ఘటనపై ఆరా

సారాంశం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ గురువారం నాడు ఫోన్ చేశారు. ఈ నెల 25న అరవింద్ పై జరిగిన దాడి గురించి ఆమె అడిగి తెలుసుకొన్నారు.

  హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురవారం నాడు ఫోన్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో జరిగిన దాడి గురించి Tamilisai Soundararajan  అడిగి తెలుసుకొన్నారు.  ఈ దాడి  ఘటనను కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ ఎంపీ అరవింద్ కు చెప్పారు.ఈ నెల 25న నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో బీజేపీ ఎంపీ అరవింద్ వాహనం ధ్వంసమైంది.

 Nizambad జిల్లా Armur నియోజకవర్గంలో ఎంపీ Dharmapur Arvind అర్వింద్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. TRS కార్యకర్తలు ఎంపీని అడ్డుకోవడం, అక్కడికి BJP  కార్యకర్తలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది.  నందిపేట మండలంలోని నూత్‌పల్లి, చిన్నయానం, అన్నారం గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్‌లోని తన ఇంటి నుంచి  బయలుదేరారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘాలకు చెందిన కార్యకర్తలు, రైతులు పసుపు బోర్డుపై ఎంపీని నిలదీసేందుకు ఆర్మూర్‌ మండలం దేగాం, ఆలూరులో రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. ఈ రెండు గ్రామాలతో పాటు ఎంపీ వెళ్లే ఇతర గ్రామాల్లో కూడా Farmers ఎంపీని నిలదీసేందుకు సిద్ధం కావడంతో పోలీసులు ఆ మార్గంలో వెళ్లొద్దని అర్వింద్‌కు సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ.. ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద 2 గంటలు ధర్నా చేశారు. 

అక్కడి నుంచి ఆర్మూర్‌ మీదుగా ఇస్సపల్లికి చేరుకున్నారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో.. ఇరు పార్టీల వారు తోపులాటకు దిగారు. ఎంపీ సమక్షంలోనే పరస్పర దాడులకు పాల్పడ్డారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు భారీగా తరలిరావడంతో వారి నుంచి తప్పించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు పొలాల వెంట పరుగెత్తారు. వారిని టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెంటపడి తరిమి చితకబాదాయి. ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎంపీ వాహనంతో పాటు పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. 

బీజేపీ కార్యకర్తలతో పాటు తనపై దాడి ఘటనకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలకు పోలీసులు మద్దతుగా నిలిచారని ఆయన ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!