తెలంగాణలో అవరోధాలను ఎదుర్కొంటున్నాను.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు..

Published : Jun 11, 2023, 03:14 PM IST
తెలంగాణలో అవరోధాలను ఎదుర్కొంటున్నాను.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు..

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ మాట్లాడుతూ.. మహిళలు తమ సమస్యలు బయటకు చెప్పడానికి  రావాలని పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులపై ఆడపిల్లలకు బాల్యం నుంచి అవగాహన కల్పించాలని తమిళిసై సూచించారు. ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరగాలని అన్నారు. 

ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడతాయని.. ఈ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు  చేయాలని అన్నారు. తెలంగాణలో తాను ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నట్టుగా గవర్నర్ తమిళిసై చెప్పారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని తెలిపారు. అలాగే అన్ని అవరోధాలను దాటగలుగుతున్నానని చెప్పారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!