రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకుని అస్వస్థతకు గురైన మహిళలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారం నాడు పరామర్శించారు.
హైదరాబాద్: అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగుల ప్రాణాలను కాపాడాలన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 30 మంది నిమ్స్,ఆపోలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాడు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలకు మనో ధైర్యం కల్పించేందుకు వచ్చినట్టుగా గవర్నర్ చెప్పారు.
undefined
ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు మంచి చికిత్స అందించాలని తాను మొదటి నుండి కోరుకుంటున్నట్టుగా గవర్నర్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాలను మెరుగుపర్చాలని ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానని గవర్నర్ తమిళిసై చెప్పారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఒకరిద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. అస్వస్థతకు గురైన మహిళల్లో మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశామన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది మీతో ఉన్నారని బాధితుల్లో భరోసా నింపామన్నారు. శస్త్ర చికిత్స చేసుకున్న మహిళల్లో ఇన్ ఫెక్షన్ వచ్చిందని వైద్యులు చెప్పారని గవర్నర్ తెలిపారు. అయితే ఈ విషయమై విచారణ సాగుతున్న విషయాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ ఏడాది ఆగస్టు 25న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి.ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన తర్వాత ఇన్ ఫెక్షన్ కు గురై నలుగురు మహిళలు మృతి చెందారు. మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు మహిళలు మరణించారు.ఆగస్టు 28న మమత ఆగస్టు 29న సుష్మ, ఆగస్టు 30న లావణ్య, మౌనికలు చనిపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 2న డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో విచారణ నిర్వహించింది. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టుగా డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ విషయమై డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఇవాళ ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో విచారణ నిర్వహిస్తుంది. నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత ఈ నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. వాంతులు, విరోచనాలతో ఈ నలుగురు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.
also read:ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి కేంద్ర బృందం.. మహిళల మృతి ఘటనపై ఆరా..
ఒకరిద్దరు రోగులుచాలా అస్వస్థతకు గురయ్యారని తాను గుర్తించినట్టుగా ఆమె చెప్పారు. డాక్టర్స్, పేషేంట్లు నీతో ఉన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఇన్ ఫెక్షన్ వచ్చిందని కొందరు డాక్టర్లు చెప్పారుకుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన డాక్టర్ ప్రాక్టీసింగ్ లైసెన్స్ ను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం.