దక్షిణాది రాష్ట్రాల జోనల్ కమిటీ: ఏపీకి విద్యుత్ బకాయిల చెల్లింపుపై కేంద్ర ఆదేశాలపై తెలంగాణ అభ్యంతరం

By narsimha lodeFirst Published Sep 4, 2022, 10:17 AM IST
Highlights

 తమ రాష్ట్రం వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏపీకి నెల రోజుల్లోపుగా రూ. 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం ఆదేశాలు  జారీ చేయడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరువనంతపురంలో నిన్న జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు ఈ అంశాలను ప్రస్తావించారు. 

తిరువనంతపురం:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారులను శనివారం నాడు ఆదేశించారు. ఈ రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఈ రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలగుగుతుందన్నారు. అంతేకాదు దక్షిణాది ప్రాంత సర్వతోముఖాభివృద్దికి దారితీస్తుందని  అమిత్ షా అభిప్రాయపడ్డారు.

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో శనివారం నాడు దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి సమస్య, తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల మధ్య వివాదాలకు పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు.

నెల రోజుల్లోపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 6,756 కోట్లుచెల్లించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల విషయమై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడాన్ని వారు ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఏకపక్షం, రాజ్యాంగ విరుద్దమని తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణకు ఏపీ నుండి రూ. 12 వేల కోట్లు చెల్లించాల్సిన విషాయ్ని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు కావొస్తున్నా కూడా కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను కేంద్రం  ఇంకా నిర్ణయించకపోవడంపై తెలంగాణ ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ ఇన్ చీఫ్ హరిరామ్, , ట్రాన్స్ కో జేఎండీ వి.శ్రీనివాసరావు, అదనపు డీజీపీ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు. 

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో 26 అంశాలపై చర్చించారు. వీటిలో 9 అంశాలను పరిష్కరించారు. మరో 17 అంశాలను తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. పరిష్కారమైన 9 అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారంగా కృష్ణా జలాల  వివాదంతో పాటు 9, 10 షెడ్యూల్ లో సంస్థల  ఆస్తులు, అప్పుల వంటి అంశాలున్నాయి. ఈ సమావేశంముగిసిన తర్వాత తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన అంశాల పరిష్కారంలో జాప్యం జరుగుతుందన్నారు.ఈ విషయాన్ని సమావేశంలో ప్రస్తావించామన్నారు. తమ ఆందోళనలను కేంద్రం త్వరలోనే పరిష్కరిస్తుందనే ఆశాభావాన్ని మంత్రి మహమూద్ అలీ వ్యక్తం చేశారు.


 

click me!