నా వద్ద పెండింగ్ బిల్లులు లేవు: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

పెండింగ్ బిల్లులపై  నాన్చివేత ధోరణి ఏమీ లేదని  తెలంగాణ గవర్నర్  తమిళిసై సౌందర రాజన్  ప్రకటించారు.  తన వద్ద  పెండింగ్ బిల్లులు  ఏవీ లేవని  గవర్నర్  చెప్పారు.


హైదరాబాద్: ప్రస్తుతం  తన వద్ద పెండింగ్ బిల్లులు  ఏమీ లేవని  తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  చెప్పారు.   రాజ్ భవన్ లో  ఆదివారం నాడు జరిగిన  సంక్రాంతి  సంబరాల్లో  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్   పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాను బిల్లులను పెండింగ్ లో పెట్టానని  అనడం సరికాదన్నారు.  యూజీసీ నిబంధనల మేరకు  సమాచారం తెప్పించుకొని చూస్తున్నట్టుగా  గవర్నర్ వివరించారు.మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరు బాలింతలు మృతి చెందడం  బాధాకరమన్నారు.  ప్రభుత్వాసుపత్రుల్లో  సదుపాయాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని  ఆమె అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా  గవర్నర్  తన వద్ద  నెలల తరబడి పెండింగ్ లో  ఉంచుకుంటున్నారని  అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే  ఈ బిల్లులను అధ్యయనం చేస్తున్నట్టుగా  గవర్నర్ ప్రకటించారు. ఈ విషయమై గత ఏడాదిలో  అధికార బీఆర్ఎస్ నేతలు, మంత్రులు  గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పించారు.  ఈ విమర్శలపై  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా  అదే స్థాయిలో  స్పందించారు.

Latest Videos

యూనివర్శిటీల్లో  ఖాళీలను భర్తీ చేయడం కోసం కామన్  రిక్రూట్ మెంట్  బోర్డు  2022 బిల్లును తెలంగాణ ప్రభుత్వం తసీుకు వచ్చింది.  అ బిల్లుతో పాటు  మరొ మూడు బిల్లులు రాజ్ భవన్ కు చేరాయి.  2022 సెప్టెంబర్ మాసంలో  ఈ బిల్లులను అసెంబ్లీ పాస్  చేసింది.  ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయితే  ఈ బిల్లులపై సందేహాలున్నాయని  గవర్నర్  తమిళిసై  రాష్ట్ర ప్రభుత్వానికి  సమాచారం పంపింది.  ఈ సమాచారం రాలేదని  రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తొలుత ప్రకటించాయి. అయితే  మేసేంజర్ ద్వారా  ఈ సమాచారం పంపినట్టుగా  రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి.

also read:గవర్నర్ అపాయింట్ మెంట్: నేడు తమిళిసైతో సబితా ఇంద్రారెడ్డి భేటీ

రాష్ట్ర ప్రభుత్వం  ఈ విషయమై  గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పించింది.ఈ విమర్శలపై  గవర్నర్ కూడా  ధీటుగా  స్పందించారు. దీంతో  గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకొని  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిశారు.  గత ఏడాది నవంబర్  10వ తేదీన గవర్నర్  తమిళిసై సౌందరరాజన్  తో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్ మెంట్  బోర్డు  2022 పై  గవర్నర్ సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా బిల్లులను పెండింగ్ లో  పెట్టలేదని  గవర్నర్  తమిళిపౌ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

click me!