కర్ణాటకలో పట్టాలు తప్పిన గూడ్స్.. వికారాబాద్ స్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లు, ప్రయాణికుల అవస్థలు

Siva Kodati |  
Published : Jan 14, 2023, 09:00 PM IST
కర్ణాటకలో పట్టాలు తప్పిన గూడ్స్.. వికారాబాద్ స్టేషన్‌లో నిలిచిపోయిన రైళ్లు, ప్రయాణికుల అవస్థలు

సారాంశం

కర్ణాటకలోని చిత్తాపూర్ సులేహళ్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. పండగ సమయం కావడంతో సొంతూళ్లకు బయల్దేరిన ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

కర్ణాటకలోని చిత్తాపూర్ సులేహళ్లిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. గంటల పాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణికులను తాండూర్‌కు తరలిస్తున్నారు. అటు ఆర్టీసీ బస్సులను కూడా తాండూర్ వరకు నడపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లను రాయచూర్ వైపు దారి మళ్లిస్తున్నారు. కేఎస్ఆర్ బెంగళూరు, రాయలసీమ, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అధికారులు దారి మళ్లిస్తున్నారు. పండగ సమయం కావడంతో సొంతూళ్లకు బయల్దేరిన ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్