ఖైరతాబాద్ గణేషుడు: తెలంగాణ, హర్యానా గవర్నర్ల తొలి పూజలు

By narsimha lodeFirst Published Sep 10, 2021, 12:48 PM IST
Highlights

ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళి సై సౌందరరాజన్, బండారు దత్తాత్రేయలు శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు.

హైదరాబాద్: హైద్రాబాద్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్  , హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయలు శుక్రవారం నాడు తొలిపూజ నిర్వహించారు.వినాయకచవితిని పురస్కరించుకొని ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం వద్ద శుక్రవారం నాడు ఇద్దరు గవర్నర్లతో పాటు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద 40 అడుగులతో పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు.ఈ విగ్రహం వద్ద ప్రముఖులు పూజలు నిర్వహించారు. తెలంగాణ, హర్యానా గవర్నర్లను నిర్వాహకులు సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై భక్తులనుద్దేశించి ప్రసంగించారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకుగాను ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆమె కోరారు.కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టడంతో ఈ దఫా ఖైరతాబాద్ గణేష్ విగ్రహన్ని దర్శించుకొనేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే మాస్కులు ధరించిన భక్తులను మాత్రమే అనుమతిస్తారు. గత ఏడాది మాత్రం గణేష్  విగ్రహం తక్కువ ఎత్తులోనే ప్రతిష్టించారు. ఈ దఫా మాత్రం కరోనా వ్యాప్తి తగ్గాలని కోరుకొంటూ పంచముఖి వినాయక విగ్రహన్ని 40 అడుగుల ఎత్తులో ప్రతిష్టించారు.

click me!