జూన్ 10న రాజ్ భవన్ లో మహిళా దర్బార్: తెలంగాణ గవర్నర్ తమిళి సై నిర్ణయం

By narsimha lode  |  First Published Jun 9, 2022, 10:31 AM IST


మహిళల సమస్యలు తెలుసుకొనేందుకు గాను తెలంగాన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ నెల 10న మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ దర్బార్ లో పాల్గొనే మహిళలు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాలని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.



హైదరాబాద్: మహిళల సమస్యలను తెలుసుకొనేందుకు తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan ఈ నెల 10వ తేదీన రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ దర్బార్ లో పాల్గొనే మహిళలు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మహిళా దర్బార్ ను నిర్వహించాలని Raj Bhavan  వర్గాలు తెలిపాయి. Telangana రాష్ట్రంలో గత నెలలో వరుస అత్యాచారాలు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. హైద్రాబాద్ అమ్నేషియా పబ్ తో పాటు మరికొన్ని ఘటనలతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.ఈ తరుణంలో Governor మహిళ దర్బార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు Mahila Darbar ను ఏర్పాటు చేసినట్టుగా  చెబుతున్నారు. మహిళా దర్బార లో పాల్గొనే వారు ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్ మెంట్ కోసం  040- 23310521  నెంబర్ కు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకోవాలని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి. 

Latest Videos

undefined

హైద్రాబాద్ Jubilee hills రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య పొసగడం లేదు. గవర్నర్ పై మంత్రుల, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానపరుస్తుందని గవర్నర్ ఆరోపణలు చేసింది. తాను అనేక ఇబ్బందులు పడుతూనే రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నానని గవర్నర్ ప్రకటించారు. ఈ నెల 2 వ తేదీన రాజ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలను గవర్నర్ చేశారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తాను తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నానని ఆమె చెప్పారు.రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించాలని గవర్నర్ నిర్ణయించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పు బట్టారు. మహిళా దర్బార్ ను వెంటనే రద్దు చేసుకోవాలని నారాయణ కోరారు.

తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య కొంత కాలంగా అగాధం పెరుగుతూ వచ్చింది. గవర్నర్ తమిళిసై  సౌందర రాజన్ లపై మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆమె ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిశారు. వారితో భేటీ అయిన తర్వాత తెలంగాణ సీఎంపై విమర్శలు చేశారు. తనను తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా అమానపరుస్తుందన్నారు.

తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ని కాదన్నారు.గవర్నర్ గా ఎవరున్నా కూడా  ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.రాజ్ భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదన్నారు. ఏ విబేధాలున్నా చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై చెప్పారు. పాత వీడియోలతో తనను ట్రోల్ చేశారని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు.ఏప్రిల్  6వ తేదీనే ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 7న కేంద్ర మోంశాఖ మంత్రి అమిత్ షాల ను ఆమె కలిశారు.  ఈ ఇద్దరితో భేటీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు.

also read:అమ్నేషియా పబ్ కేసు: నివేదిక కోరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కానీ అలా చేయడం టీఆర్ఎస్ సర్కార్ కు ఇబ్బందిగా మారితే తాను ఏం చేయలేనన్నారు. కేసీఆర్ ను తాను సోదరుడిగా భావించానన్నారు. కానీ తనను అవమానిస్తున్నారన్నారు. రాజ్ భవన్ కు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలన్నారు.  గవర్నర్  చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. 
 


  

click me!