ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. మహబూబాబాద్ ఎస్పీని ప్రభుత్వం బదిలీ చేసింది.
హైదరాబాద్:ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ లో చేరుతానని ప్రకటించిన గంటల వ్యవధిలోనే మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ బదిలీ అయ్మారు. మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎమ్మెల్యే అల్లుడు .మహబూబాబాద్ ఎస్పీ బదిలీపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. రేఖానాయక్ పై కోపంతో ఈ బదిలీ చేశారా అని విపక్ష నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీ జరిగినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ బదిలీని సాధారణ బదిలీగా విపక్షాలు చూడడం లేదు.
ఈ నెల 21న బీఆర్ఎస్ జాబితాను కేసీఆర్ ప్రకటించారు. ఈ జాబితాలో రేఖానాయక్ కు టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని రేఖానాయక్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవి కాలం పూర్తయ్యే వరకు తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే మహబూబాబాద్ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను బదిలీ చేసింది ప్రభుత్వం.
undefined
2014, 2018 ఎన్నికల్లో ఖానాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో రేఖానాయక్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా రేఖానాయక్ కు బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు నిరాకరించింది.రేఖా నాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ కు బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. జాన్సన్ నాయక్ ఎస్టీ కాదని రేఖా నాయక్ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలపై సరైన సమయంలో స్పందిస్తానని జాన్సన్ నాయక్ ప్రకటించారు.ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జాన్సన్ నాయక్ ప్రచారం ప్రారంభించారు. మరో వైపు రేఖా నాయక్ కూడ విస్తృతంగా పర్యటిస్తున్నారు.