నాకు పిచ్చిలేస్తే కాల్చిపడేస్తా: కాంగ్రెస్ నేతలకు మర్రి జనార్ధన్ రెడ్డి వార్నింగ్

By narsimha lode  |  First Published Aug 28, 2023, 2:48 PM IST

కాంగ్రెస్ నేతలకు  బీఆర్ఎస్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు పిచ్చిలేస్తే  కాల్చిపడేస్తానని  వార్నింగ్ ఇచ్చారు.


నాగర్ కర్నూల్: నాతో పెట్టుకొంటే కాల్చి పడేస్తానని  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి  కాంగ్రెస్ నేతలకు  వార్నింగ్ ఇచ్చారు. 
నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  జరిగిన  ఓ సభలో  ఆయన  కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.తన సంగతి మీకు తెలియదన్నారు. తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని వ్యాఖ్యానించారు.తనతో పెట్టుకొంటే  మీకే నష్టమని  మర్రి జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ నేతలు తనను రెచ్చగొడుతున్నారన్నారు. తనతో పెట్టుకోవద్దు.. తాను అన్ని కట్టెల్లో కాలి వచ్చినోడినన్నారు.తాను పీకిపడేస్తే చెయ్యి వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు.తన కేడర్ కు  చెబితే కాంగ్రెస్ నేతలు ఏ ఒక్కరూ కూడ గ్రామాల్లో తిరగనివ్వరని మర్రి జనార్థన్ రెడ్డి  చెప్పారు.

10 ఏళ్లలో  నాగర్ కర్నూల్ లో అభివృద్దిని గ్రామాల్లో వివరిస్తూ  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి  పాదయాత్రను ప్రారంభించారు. రెండు రోజులుగా పాదయాత్ర  సాగుతుంది.  ఆదివారంనాడు రాత్రి తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో  పాదయాత్ర చేరిన సందర్భంగా  నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే  మర్రి జనార్థన్ రెడ్డి  ప్రసంగించారు. ఈ సభలో  కాంగ్రెస్ నేతలపై   ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి  సీరియస్ వ్యాఖ్యలు చేశారు.  తనతో పెట్టుకోవద్దని  కాంగ్రెస్ నేతలకు వార్నింగ్  ఇచ్చారు.  ఈ క్రమంలో  ప్రసంగిస్తూ  తనకు పిచ్చిలేస్తే కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. 

Latest Videos

2014, 2018 ఎన్నికల్లో  నాగర్ కర్నూల్ నుండి  మర్రి జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.  మరోసారి ఇదే స్థానం నుండి ఆయన  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల  21న  కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రి జనార్థన్ రెడ్డికి చోటు దక్కింది.  ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్  తరపున  మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు  పోటీ పడుతున్నారు.  ఇద్దరు నేతలు కాంగ్రెస్ టిక్కెట్టు కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత 10 ఏళ్లలో  నియోజకవర్గంలో  చేసిన అభివృద్ది కార్యక్రమాలను  వివరించేందుకు  పాదయాత్రను  రెండు రోజుల క్రితం మర్రి జనార్థన్ రెడ్డి ప్రారంభించారు. నెల రోజుల పాటు ఈ పాదయాత్రను మర్రి జనార్థన్ రెడ్డి  నిర్వహించనున్నారు. 

2014 వరకు  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానానికి  నాగం జనార్థన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు.  2009లో  ఆయన  టీడీపీ అభ్యర్థిగా  విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో నాగం జనార్థన్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు.  టీడీపీకి రాజీనామా  చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడ ఆయన  రాజీనామా సమర్పించారు.  దీంతో  2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నాగం జనార్థన్ రెడ్డి  పోటీ చేసి విజయం సాధించారు.  2014లో  నాగం జనార్థన్ రెడ్డి  తనయుడు ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  2018లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నాగర్ కర్నూల్ నుండి బరిలోకి దిగిన నాగం జనార్థన్ రెడ్డి  ఓటమి పాలయ్యాడు.

 

 

click me!