కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, పొత్తుల చర్చలపై మాణిక్‌రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు..

Published : Aug 28, 2023, 05:08 PM IST
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల, పొత్తుల చర్చలపై మాణిక్‌రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు..

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి చర్చలు సీఎల్పీ లీడర్, పీసీసీ ప్రెసిడెంట్ సమక్షంలో జరుగుతాయని  స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి చర్చలు సీఎల్పీ లీడర్, పీసీసీ ప్రెసిడెంట్ సమక్షంలో జరుగుతాయని  స్పష్టం చేశారు.  పొత్తులకు సంబంధించి వామపక్ష పార్టీలతో అధికారిక చర్చలు జరగలేదని తెలిపారు. సీపీఐతో అనధికార సమావేశం జరిగిందని చెప్పారు. అయితే పొత్తుల గురించి, సీట్ల గురించి చర్చ జగరలేదని అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు పలకడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో పార్టీకి ఉపయోగపడే విషయాలు పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే జరుగుతాయన్నారు. తనను ప్రత్యక్షంగా చర్చలు జరపమని హైకమాండ్ చెప్పలేదని వెల్లడించారు. తనను చాలా మంది కలవడానికి వస్తుంటారని.. వారు ఏదేదో మాట్లాడితే తానేం చేయగలనని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వీలైనంతా త్వరగా ప్రకటిస్తామని చెప్పారు. 

కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల పార్టీ చేరిక అంశం అధిష్టానమే చూసుకుంటుందని మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. రానున్న ఎన్నికల్లో కీలక హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇస్తామని.. దీనిని ప్రతి ఇంటివరకు తీసుకెళ్తామని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని  తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?