తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ పై బదిలీ వేటు

By narsimha lodeFirst Published Jun 28, 2020, 6:12 PM IST
Highlights

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ ను  ప్రభుత్వం ఆదివారం నాడు బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని వీకే సింగ్ ను ప్రభుత్వం ఆదేశించింది

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ ను  ప్రభుత్వం ఆదివారం నాడు బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని వీకే సింగ్ ను ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా వీకే సింగ్ స్థానంలో  పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మెన్ గా శ్రీనివాసరావుకు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం  ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 

తనకు ముందుగానే రిటైర్మెంట్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన వీకే సింగ్ డీవోపీటీకి లేఖ రాశాడు. 

గత కొంత కాలంగా ఆయన ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాడు. 1987 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. 33 ఏళ్ల సర్వీసు ఉన్న తనకు పదోన్నతి కల్పించడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను డీజీగా ఎంపానెల్ అయ్యానని చెప్పారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు మూడేళ్ల క్రితమే డీజీపీ పదోన్నతి పొందారని ఆ లేఖలో పేర్కొన్నారు.

తాను పదోన్నతికి పనికిరాకపోతే ఉద్యోగాన్ని వదిలేయడానికి కూడ సిద్దమేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ లేఖ రాసిన తర్వాత పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్న వీకే సింగ్ పై ప్రభుత్వం ఇవాళ బదిలీ చేసింది. 
 

click me!