కరోనా ఎఫెక్ట్: రాత్రి ఏడు గంటల వరకే హైద్రాబాద్‌లో మెడికల్ షాపులు

By narsimha lodeFirst Published Jun 28, 2020, 5:31 PM IST
Highlights

 హైద్రాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి ఏడు గంటల వరకే మెడికల్ దుకాణాలను తెరవాలని మెడికల్ దుకాణాల యజమానులు నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి ఏడు గంటల వరకే మెడికల్ దుకాణాలను తెరవాలని మెడికల్ దుకాణాల యజమానులు నిర్ణయం తీసుకొన్నారు.

హైద్రాబాద్ పశ్చిమ మండల మెడికల్ దుకాణాల అసోసియేషన్ ఆదివారం నాడు జరిగింది. ఈ సమావేశంలో కరోనా కేసుల గురించి చర్చించారు. 

హైద్రాబాద్ నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరగడంపై ఫార్మసిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ షాపుల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులు కూడ కరోనా బారినపడ్డారు. దీంతో మెడికల్ దుకాణాల యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు ఇవాళ అత్యవసరంగా సమావేశమై చర్చించారు.

ఫార్మసిస్టులు కరోనా బారినపడకుండా ఉండేందుకుగాను రాత్రి పూట 7 గంటలకే మెడికల్ దుకాణాలను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకే మెడికల్ దుకాణాలను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా  కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో శనివారం నాడు ఒక్క రోజే 1087 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 13,436కి  చేరుకొన్నాయి. 
 

click me!