తెలంగాణలో బదిలీలు: 28 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

By narsimha lode  |  First Published Jul 19, 2023, 8:07 PM IST


తెలంగాణలో  పలువురు  స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ,   డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం  బదిలీ చేసింది.


హైదరాబాద్:  రాష్ట్రంలో 28 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు,  డిప్యూటీ కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వం బుధవారంనాడు బదిలీ చేసింది.  డి. మధుసూధన్ నాయక్  ను మంచిర్యాల నుండి ఖమ్మంకు, జి.రమేష్ ను  మెదక్ నుండి హైద్రాబాద్ ఎస్‌సీడీసీ కి బదిలీ చేశారు.  కె. వెంకటేశ్వర్లుకు  భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్ గా  బదిలీ అయ్యారు. కె. సీతారామారావును ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఎం. వెంకటేశ్వర్లును  హైద్రాబాద్  నుండి  నాగర్ కర్నూల్ కు , ఎన్ . మధుసూధన్ ను  ఖమ్మం నుండి  హైద్రాబాద్ కు అడిషనల్ కలెక్టర్ గా బదిలీ చేశారు.

ఎ. పద్మశ్రీ ని  మహబూబ్ నగర్ నుండి  మెదక్ కు, వి.భుజంగరావును  వేములవాడ నుండి  బాన్సువాడకు  బదిలీ చేశారు. కె.శ్యామల దేవిని  బెల్లంపల్లి నుండి  ఉట్నూర్ కు , హరిప్రియను  రంగారెడ్డి ఎస్‌డీసీ నుండి  మేడ్చల్ మల్కాజిగిరికి బదిలీ చేశారు. డి. వేణును  మంచిర్యాల నుండి  మహబూబ్ నగర్  కు , మధుసూధన్ రావును  నారాయణఖేడ్ నుండి  పెద్దపల్లికి, డి.కొమరయ్యను  మహబూబాబాద్ నుండి నారాయణఖేడ్ కు  ట్రాన్స్ ఫర్ చేశారు.

Latest Videos

టీఏవీ నాగలక్ష్మి నాగర్ కర్నూల్ నుండి  మేడ్చల్ మల్కాజిగిరికి, టి. దశరథ్ ను ఖమ్మం నుండి స్టేషన్ ఘన్ పూర్ కు ,  కె. స్వర్ణలతను  కొల్లాపూర్ నుండి మంథనికి, టి.రవికి భద్రాచలంలో, డి. చంద్రకళకు గద్వాలలో పోస్టింగ్  ఇచ్చారు.

వి. రాములుకు  గద్వాల నుండి నాగర్ కర్నూల్ కు , ఎల్. అలివేలు కు మహబూబాబాద్ లో పోస్టింగ్  ఇచ్చారు.  కేఎస్‌బీ  కుమారిని హైద్రాబాద్ నుండి రంగారెడ్డి ఎస్‌డీసీకి,  ఆర్. శిరీషను ఖమ్మం నుండి  కొత్తగూడెంకు,పి. నాగరాజుకు  కొల్లాపూర్ లో పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.

also read:తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ.. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్

ఇవాళే ఐదుగురు ఐపీఎస్  అధికారులను ప్రభుత్వం  బదిలీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు,  డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. త్వరలోనే  తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ తరుణంలో  బదిలీలపై విపక్షాలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి.
 

click me!