తెలంగాణ నిరుద్యోగులకు ఇంకో తీపి కబురు

Published : Oct 25, 2017, 05:44 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
తెలంగాణ నిరుద్యోగులకు ఇంకో తీపి కబురు

సారాంశం

సంగారెడ్డి జిల్లాలో కడియం ప్రకటన విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని వెల్లడి ఇప్పటికే 8వేల పోస్టుల భర్తీ జరుగుతున్నది. త్వరలో మరో 8వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తాం

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి కడియం శ్రీహరి మరో తీపి కబురు చెప్పారు. త్వరలో 8వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కడియం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, పుల్కల్ లో రెండు పాలిటెక్నిక్ కాలేజీలను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే బాబుమోహన్, మాజీ ఎంపీ మానిక్ రెడ్డి, స్థానిక అధికారులు, నేతలు పాల్గొన్నారు.

కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ స్థానికుల కు న్యాయం జరిగి ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో జిల్లా ప్రాతిపదికన 31 జిల్లాలకు ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ (టీఆర్టీ) ఇచ్చామన్నారు. దీనివల్ల అటవీ ప్రాంతాలైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అసిఫాబాద్ లలో కూడా స్థానికులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కొంతమంది దీనిని అడ్డుకొని స్థానికులకు అన్యాయం చేసే పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

డీ. ఈడి కోర్సు పూర్తి కాకుండా వారికి ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ లో అవకాశం ఇవ్వాలని కొంతమంది అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేనాటికే కోర్సు పూర్తి చేసి ఉండాలన్న నిబంధన ఉంది. దీనిని కాదని అవకాశం కల్పించలేమని స్పష్టం చేశారు. 2018 మార్చి నెలలో డి-ఈ డి కోర్సు పూర్తి చేసేవారికి ఇప్పుడు అవకాశం కల్పించడానికి నిబంధనలు ఒప్పుకోవని స్పష్టం చేశారు. డి. ఈడి విద్యార్థులు సరిగా నోటిఫికేషన్ చూడక ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని కోరారు.

రెండేళ్లలో 525 గురుకులాలు ప్రారంభించుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ప్రకటించారు కడియం. ఒక్కో గురుకులానికి 20 కోట్ల రూపాయల చొప్పున 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. గురుకులాల్లో 16 వేల టీచర్ల పోస్టులు భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే ఇందులో 8వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మిగిలిన 8వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు.

 

మహిళలకు షాక్ ఇచ్చిన సంగారెడ్డి టిఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో) వార్తతోపాటు మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://goo.gl/tnsQok

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!