మరో రెండు పాజిటివ్ కేసులు: అనంతగిరిలో కరోనాకు ప్రత్యేక ఆసుపత్రి

By narsimha lodeFirst Published Mar 4, 2020, 5:24 PM IST
Highlights

కరోనా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సర్కార్ యోచిస్తోంది.


హైదరాబాద్: హైద్రాబాద్‌లో కరోనాకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని  తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైద్రాబాద్ నడిబొడ్డున ఉన్న  గాంధీ ఆసుపత్రిలో కాకుండా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో  కరోనా రోగుల కోసం ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సర్కార్  ప్రతిపాదిస్తోంది.

Also read:హోలీ వేడుకలపై నిషేధం: తెలంగాణ హైకోర్టులో పిటిషన్

 తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ కు చెందిన ఓ టెక్కీకి  ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆయనకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.

ఈ నెల 3వ తేదీ నాటికి 47 మందికి కరోనా శాంపిల్స్ తీసుకొన్నారు. అయితే 45 మందికి  కరోనా లక్షణాలు లేవని ప్రభుత్వం ప్రకటించింది. అయితే  మరో ఇద్దరి శాంపిల్స్‌ను మరోసారి పూణెలోని  వైరాలజీకి అధికారులు పంపారు.

అయితే తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా కేంద్రం ప్రకటించింది.  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో  గాంధీ ఆసుప్రతిలో కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకవార్డులను ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో సుమారు 40  బెడ్స్ గదిని ఏర్పాటు చేశారు. 

అయితే గాంధీ ఆసుపత్రిని కాకుండా వికారాబాద్‌ జిల్లా అనంతగిరి వద్ద ఉన్న ఆసుపత్రిలో కరోనా కొరకు ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

అనంతగిరిలో టీబీ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలోనే ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిని  తరలించాలని గతంలో కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేసింది. ఈ విషయమై డాక్టర్లు, ప్రజా సంఘాలు, పలు పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. దీంతో ఈ నిర్ణయం విషయంలో సర్కార్ వెనక్కు తగ్గింది.

ప్రస్తుతం అనంతగిరి లో టీబీ ఆసుపత్రి కొనసాగుతోంది. ఈ ప్రాంతం  జనావాసాలకు దూరంగా ఉంటుంది. హైద్రాబాద్ కు సుమారు 75 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఇదే ఆసుపత్రి ఆవరణలో  కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

 

click me!