కరోనా ఎఫెక్ట్,హోలీ వేడుకలపై నిషేధం: హైకోర్టులో పిటిషన్

By narsimha lode  |  First Published Mar 4, 2020, 4:33 PM IST

కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హోలీ పండుగపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించాలని  హైద్రాబాద్ మణికకొండకు చెందిన గంపా సిద్దలక్ష్మి బుధవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హోలీ పండుగపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించాలని  హైద్రాబాద్ మణికకొండకు చెందిన గంపా సిద్దలక్ష్మి బుధవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also read:కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన మాస్క్‌ల ధరలు

Latest Videos

undefined

ఈ నెల 9 లేదా 10వ తేదీల్లో హోలీ సంబరాలు జరగనున్నాయి. ప్రధాన మంత్రి మోడీ కూడ హోలి సంబరాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. సభలు, సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని వైద్యులు కూడ సూచిస్తున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో హోలి పండుగను నిషేధించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.  అయితే ఈ విషయమై కోర్టు ఏ విధమైన ఆదేశాలు ఇస్తోందో చూడాలి

click me!