25 రోజుల్లో 341 మంది మృతి: హైకోర్టుకు తెలంగాణ సర్కార్ నివేదిక

By narsimha lodeFirst Published Apr 27, 2021, 2:38 PM IST
Highlights

తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నాడు నివేదికను సమర్పించింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నాడు నివేదికను సమర్పించింది. ఈ నెల 1 నుండి 25వ తేదీ వరకు 23.56 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.  వీరిలో 4.39 మందికి ఆర్టీపీసీఆర్, 10.16 లక్షల ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్టుగా తెలిపింది. 

also read:డబ్బులిస్తేనే డెడ్‌బాడీ: హైద్రాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపీడీ

కరోనా పరీక్షలు ఎక్కువగా చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నెల 1 నుండి 25 వ తేదీ వరకు 341 మంది కరోనాతో మరణించారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేట్ 3.5 శాతంగా ఉందని ప్రకటించింది. కరోనా నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్ లో నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్ లు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొన్నామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మద్యం దుకాణాలను ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది.రాష్ట్రానికి  430 టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుండి ఆక్సిజన్ ను  చేరవేస్తున్నామన్నారు.  రెమిడెసివర్ పర్యవేక్షణ  కోసం నోడల్ అధికారిగా ప్రీతిమీనాను నియమించినట్టుగా ప్రభుత్వం వివరించింది. 

click me!