తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కల్లోలం... తాజాగా కామారెడ్డి ఎస్సై మృతి

By Arun Kumar PFirst Published Apr 27, 2021, 2:21 PM IST
Highlights

కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవచేస్తున్న ప్రంట్ లైన్ వారియర్స్ కూడా వైరస్ బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 

కామారెడ్డి: తెలంగాణలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మ్రోగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరించడమే కాదు అధికంగా మరణాలను కారణమవుతోంది. కరోనా కష్టకాలంలోనూ ప్రాణాలకు తెగించి మరీ ప్రజలకు సేవచేస్తున్న ప్రంట్ లైన్ వారియర్స్ కూడా వైరస్ బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి కరోనాతో బాధపడుతూ మృతిచెందాడు. 

ఇటీవలే కరోనా బారినపడ్డ కామారెడ్డి ఎస్సై గణపతి మంగళవారం మరణించాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఎస్సై టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందాడు. ఇలా మూడురోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో గణపతి తుదిశ్వాస విడిచాడు. 

read more  డబ్బులిస్తేనే డెడ్‌బాడీ: హైద్రాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపీడీ

ఇక తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటల్లో 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4,11,905కి చేరుకొన్నాయి. ఒక్క రోజులో కరోనాతో 52 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 69,221కి చేరుకొన్నాయి.  కరోనాతో మరణాల రేటు 0.50శాతానికి చేరుకొన్నాయి.ఇంకా రాష్ట్రంలో 5474 మంది పరీక్షలు రావాల్సి ఉంది.

ఆదిలాబాద్ జిల్లాలో 140, కొత్తగూడెంలో 174,జీహెచ్ఎంసీలో1440,జగిత్యాలలో 204, జనగామలో 160,భూపాలపల్లిలో101,కామారెడ్డిలో 279, కరీంనగర్ లో 369,ఖమ్మంలో 424, ఆసిఫాబాద్ 77, మహబూబ్‌నగర్ లో 417,మంచిర్యాలలో 195, మెదక్ లో 229,మల్కాజిగిరిలో 751,ములుగులో 79, నాగర్‌కర్నూల్ లో 257, నల్గొండలో469 లో కేసులు నమోదయ్యాయి.

నారాయణపేటలో 38,నిర్మల్ లో 129,నిజామాబాద్ లో 498,పెద్దపల్లిలో 169,సిరిసిల్లలో225, సంగారెడ్డిలో 262, సిద్దిపేటలో 230, సూర్యాపేటలో 308, వికారాబాద్ లో 281, వనపర్తిలో 157,వరంగల్ రూరల్ లో 233,వరంగల్ అర్బన్ 653, భువనగిరిలో 278 కేసులు రికార్డయ్యాయి. 


 

click me!