సికింద్రాబాద్ బోయిగూడ అగ్ని ప్రమాదం: రేపు స్వస్థలాలకు డెడ్‌బాడీలు

Published : Mar 23, 2022, 02:44 PM IST
సికింద్రాబాద్ బోయిగూడ అగ్ని ప్రమాదం:  రేపు స్వస్థలాలకు డెడ్‌బాడీలు

సారాంశం

సికింద్రాబాద్ బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి మృతదేహలను  శంషాబాద్ నుండి రేపు స్వస్థలాలకు తరలించనున్నారు. 

హైదరాబాద్: Secundrabad బోయిగూడలో సజీవ దహనమైన కార్మికుల మృతదేహలను గురువారం నాడు ఉదయం Shamshabad ఎయిర్ పోర్టు నుండి స్వస్థలాలకు తరలించనున్నారు.

బుధవారం నాడు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో  11 మంది సజీవ దహనమయ్యారు.  ఈ ప్రమాదం నుండి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.  ఈ ఘటనలో సజీవ దహనమైన 11 మంది workers మృతదేహలకు Gandhi ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతులను కూడా గుర్తించారు. మృతదేహలన     రేపు విమానంలో శంషాబాద్ విమానాశ్రయం నుండి Bihar కు తరలించనున్నారు. బీహార్ రాష్ట్రంలోని చప్రా జిల్లా నుండి కార్మికులు ఉపాధి కోసం హైద్రావాద్ వచ్చి  ఈ Godown లో పనిచేస్తున్నారు.  

వీరితో పాటు Hyderabad, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బీహార్ కు చెందిన వారు ఉపాధి కోసం వచ్చి నివసిస్తున్నారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకొన్న తర్వాత  వారంతా సంఘటన స్థలానికి  చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. గాంధీ ఆసుపత్రి వద్ద మృతుల బంధువులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. మరో వైపు ఈ గోడౌన్ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి  సంబంధిత శాఖలతో సమీక్ష చేయనున్నారు. ఫైర్, పోలీస్, విజిలెన్స్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. గోడౌన్లలో సేఫ్టీ చర్యలు   ఎలా ఉన్నాయనే విషయాలపై కూడా చర్చించనున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?